కొడిమ్యాల

కొడిమ్యాలలో స్వచ్ఛంద బంద్ పాటించిన వాణిజ్య సముదాయాలు

viswatelangana.com

April 25th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కొడిమ్యాల పట్టణంలో జమ్మూ కాశ్మీర్ లో పహల్గాంలో పర్యటిస్తున్న పర్యాటకులను విచక్షణ రహితంగా మత ఆధారంగా కలమా చదువకపోతే అతి కిరాతకంగా చంపడం దారుణమైన చర్యఇట్టి ఉగ్రవాద చర్యను తీవ్రంగా ముక్తా కంఠంతో 140 కోట్ల హిందూస్తాన్ భారతీయులు ఖండిస్తున్నాం,అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులను వారిని పెంచి పోషిస్తున్న అధిపతులను సహకరిస్తున్న వారిని వదిలి పెట్టకుండా దేశ ప్రధాని చర్యలు తీసుకోవాలని ఈ సమయంలో ప్రతి దేశ పౌరుడు పౌరురాలు అన్ని రాజకీయ పార్టీలు సంస్థలు ముందుకు రావాలి ఉగ్రవాదమును అరికట్టాలి అని స్థానిక అంగడిబజార్, గాంధీ చౌక్ నుండి బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు, తర్వాత మరణించిన వారి ఆత్మ శాంతి కొరకు రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. కొడిమ్యాల మండల కేంద్రంలోని వాణిజ్య సముదాయాలు అన్ని స్వచ్ఛందంగా బంద్ చేశారు. ఈ కార్యక్రమంలో హిందువులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button