కోరుట్ల
కొల్ కత్తా ఆర్జికల్ కాలేజి పీజీ విద్యార్థినిపై జరిగిన సంఘటనకు నిరసన

viswatelangana.com
August 18th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
తల్లి జన్మనిస్తే వైద్యులు పునర్జన్మని ఇస్తారు.. అలాంటి వైద్యులపై ఈ మారణకాండ జరగడం చాలా సిగ్గుచేటు… కొల్ కత్తా ఆర్జికల్ కాలేజీలో పీజీ విద్యార్థినిపై జరిగిన సంఘటనకు నిరసనగా జగిత్యాల్ జిల్లా మార్కెటింగ్ అసోసియేషన్ తరపున తహసిల్ చౌరస్తాలో కొవ్వొత్తులతో నివాళులర్పించి, దీనికి కారకులైన దోషులను వెంటనే శిక్షించి మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వాలు ఏకతాటిపై నిర్ణయం తీసుకొని వైద్యులకు రక్షణ కల్పించాలని, జిల్లా మార్కెటింగ్ అసోసియేషన్ తరపున డిమాండ్ చేసారు. జిల్లా అధ్యక్షుడు గుండు సుధాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి సంతోష్, ఉపాధ్యక్షుడు రాజశేఖర్, అంజన్న సహాయ కార్యదర్శి గంగారెడ్డి, ప్రచార కార్యదర్శి సంపత్, కార్యవర్గ సభ్యులు పృథ్వీరాజ్, కార్తీక్, కీర్తి కుమార్, సభ్యులు రవి, రాజేందర్, ఆనంద్, రియాజ్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.



