కోరుట్ల

కోరుట్ల డిపోలో ప్రమాద రహిత వారోత్సవాలు

viswatelangana.com

July 25th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల డిపోలో డిపో మేనేజర్ ఎన్. మనోహర్ ఆధ్వర్యంలో ప్రమాద రహిత వారోత్సవాలను నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంవీఐ డ్రైవర్ లు భద్రత సూక్తులను తప్పకుండా పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించాలని తెలిపి మరికొన్ని సూక్తులను తెలపడం జరిగింది. అలాగే డిపో మేనేజర్ మాట్లాడుతూ… ప్రమాద రహిత వారోత్సవాలను వారం రోజులపాటు జరుపుకుంటాము.మొదటి రోజు.. ప్రమాదహిత వారోత్సవాల ప్రారంభం రెండవ రోజు. శిక్షణ రోజు, మూడవరోజు. మెడికల్ ఎగ్జామినేషన్ రోజు, నాలుగవ రోజు. ప్రైవేట్ హెయిర్ బస్ డ్రైవర్ల రోజు, ఐదవ రోజు. మెయింటెనెన్స్ డే, ఆరవ రోజు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ రోజు, ఏడవ రోజు. డ్రైవర్స్ డే ఇలా వారం రోజులు ప్రమాద రహిత వారోత్సవాలను జరుపుకుంటామని తెలుపుతూ డ్రైవర్ల ను ఉద్దేశించి పలు భద్రత సూక్తులను మరియు సూచనలను తెలిపి ప్రమాదాలు నివారించాలని తెలపడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో డ్రైవర్లు, మెకానిక్ లు, కండక్టర్లు, సూపర్వైజర్, సిబ్బంది పాల్గొన్నారు

Related Articles

Back to top button