కోరుట్ల ఫిల్టర్ బెడ్ ఆధునీకరణకు నిధులు మంజూరు కు కృషి చేస్తాం
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు

viswatelangana.com
కోరుట్ల పట్టణంలో ప్రజల దాహార్తి తీర్చాలనే ఉద్దేశంతో గతంలో మాజీమంత్రి జువ్వాడి రత్నాకర్ రావు హయాంలో నిర్మించినటువంటి పిల్టర్ బెడ్ ప్రస్తుత జనాభా అవసరాల కోసం మరిన్ని నిధులు మంజూరు చేయించి ఆధునికరిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు. కోరుట్ల పట్టణంలోని ఫిల్టర్ బెడ్ ను స్థానిక మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మంగళవారం సందర్శించిన అనంతరం పత్రిక విలేకరులతో మాట్లాడుతూ గతంలో అప్పటి మంత్రి దివంగత జువ్వాడి రత్నాకర్ రావు హయాంలో ఫిల్టర్ బెడ్ నిర్మాణం చేశారని, నేడు కోరుట్ల పట్టణంలో జనాభా పెరిగిన దృశ్య మరిన్ని నిధులు మంజూరు చేయించి పిల్టర్ బెడ్ ఆధునికరించి ప్రజల అవసరాలు తీర్చుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ ఆర్డబ్ల్యూఎస్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్, నయీమ్, రిజ్వాన్, చిట్యాల లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.



