కోరుట్ల

యువతను ప్రొత్సహించాలనే సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన

viswatelangana.com

July 2nd, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల మార్కెట్ కమిటీ తదుపరి చైర్మన్ ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. చైర్మన్ పదవి జనరల్ క్యాటగిరీ కావడంతో పలువురు ఆశావాహులు ఈ పదవిని ఆశీస్తున్నారు. ముఖ్యంగా ఈ రేసులో కోరుట్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి పేరు వినిపిస్తోంది. జువ్వాడి నర్సింగరావు, కృష్ణారావు శిష్యుడిగా నియోజకవర్గ స్థాయిలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఏలేటి మహిపాల్ రెడ్డి, ప్రస్తుతం ఆయన పేరు ఇపుడు ప్రముఖంగా వినిపిస్తోంది. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి రేసులో ఆయన ముందు వరుసలో ఉన్నారు. యువతను ప్రొత్సహించాలనే సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన. జువ్వాడి బ్రదర్స్ అండదండలతో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి రేసులో ముందున్నారు. కష్టకాలంలో తోడుగా. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్న కూడా ఏనాడు పార్టీని వీడలేదు, ఇతర పార్టీల ప్రలోభాలకు లొంగకూండా కాంగ్రెస్ కోసం కష్టపడి పనిచేస్తున్నారు ఏలేటి మహిపాల్ రెడ్డి, జువ్వాడి బ్రదర్స్ కు వెన్నంటే ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన బై ఎలక్షన్ నుంచి పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నారు. దివంగత నేత, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ ని ఆదర్శంగా తీసుకొని పార్టీ కోసం పనిచేస్తున్నారు. జువ్వాడి నర్సింగ్ రావు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి ఆయనకు వెన్నెంటే ఉండి.. నమ్మిన బంటుగా పేరు తెచ్చుకున్నారు. వారి ఆశీర్వాదంతోనే కోరుట్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి నియోజవర్గంలోని నాలుగు మండలాలైన కోరుట్ల, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మెట్ పల్లిలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తిచూపుతూ.. ర్యాలీలు, ఆందోళనలు చేశారు.

కష్టకాలంలో తోడుగా. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్న కూడా ఏనాడు పార్టీని వీడలేదు, ఇతర పార్టీల ప్రలోభాలకు లొంగకూండా కాంగ్రెస్ కోసం కష్టపడి పనిచేస్తున్నారు ఏలేటి మహిపాల్ రెడ్డి, జువ్వాడి బ్రదర్స్ కు వెన్నంటే ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన బై ఎలక్షన్ నుంచి పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నారు. దివంగత నేత, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ ని ఆదర్శంగా తీసుకొని పార్టీ కోసం పనిచేస్తున్నారు. జువ్వాడి నర్సింగ్ రావు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి ఆయనకు వెన్నెంటే ఉండి.. నమ్మిన బంటుగా పేరు తెచ్చుకున్నారు. వారి ఆశీర్వాదంతోనే కోరుట్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి నియోజవర్గంలోని నాలుగు మండలాలైన కోరుట్ల, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మెట్ పల్లిలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తిచూపుతూ.. ర్యాలీలు, ఆందోళనలు చేశారు.

సేవా కార్యక్రమాలు..గతంలో కాంగ్రెస్ అధికారంలో లేకపోయిన పీసీపీ నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో పాల్గొని నిరసనలు తెలిపేవారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నారు మహిపాల్ రెడ్డి. మరోవైపు కరోనా సమయంలో. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా టైంలో బయటకు రావాలంటే భయపడిపోయేవారు. కానీ మహిపాల్ రెడ్డి మాత్రం. పేదలకు ఆహారం అందించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. అలాగే అనేక మందిని ఆదుకున్నారు. ప్రస్తుతం చైర్మన్ పదవి రేసులో మండల అధ్యక్షులు కొంతం రాజం, బ్లాక్ కాంగ్రెస్ నేత సత్యనారాయణ పేరుమాళ్ల ఉన్నారు. అయిన కూడా పార్టీ కోసం ఇన్నేళ్లుగా పనిచేస్తున్న మహిపాల్ రెడ్డికే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దక్కుతుందని కాంగ్రెస్ నాయకులు గుసగసలాడుతున్నారు. మరోవైపు మహిపాల్ రెడ్డి సైతం తాను పార్టీ కోసం చేసిన సేవలను గుర్తించి. చైర్మన్ పదవి తనకే వస్తుందని అశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Back to top button