కోరుట్ల
కోరుట్ల మెడికల్ హోల్ సేల్ అసోసియేషన్ అధ్యక్షునిగా కోటగిరి నరేష్ ఏకగ్రీవ ఎన్నిక

viswatelangana.com
June 9th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కోరుట్ల మెడికల్ హోల్ సేల్ అసోసియేషన్ అధ్యక్షునిగా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన కోటగిరి నరేష్ (శ్రీ వెంకటేశ్వర మెడికల్)ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షులు కోటగిరి నరేష్ మాట్లాడుతూ నాపైన నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘ సభ్యులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ సంఘంలో ఎవరికి ఏ అవసరం వచ్చిన తాను ముందుండి వారి సమస్యలను పరిష్కరిస్తానని సభ్యులందరికీ హామీ ఇస్తున్నానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రవి, నాగరాజ్, కళ్యాణ్, దినేష్, సందీప్, వెంకటేష్, శ్రీధర్, రామకృష్ణ, వినోద్ పాల్గొని అధ్యక్షునికి శుభాకాంక్షలు తెలిపారు



