కోరుట్ల లిటిల్ జీనియస్ హెస్కూల్ లో ఎన్ సిసి రిక్రూట్మెంట్ ప్రారంభం

viswatelangana.com
ఎన్సీసీ కొత్త రిక్రూట్మెంట్ (2024-2025 ) కంటే లిటిల్ జీనియస్ హై స్కూల్ లో ప్రారంభించబడింది. ఇందులో (15) మంది బాలురు (14 )మంది బాలికలు ఎంపిక చేయబడ్డారు.ఈ ఎంపిక ప్రాతిపదికగా విద్యార్థుల హైటు,శారీరక దృఢత్వం మానసిక సామర్థ్యం పరుగుతో ఎంపిక చేశారు. నైన్ తెలంగాణ బెటాలియన్ కరీంనగర్ నుండి ఆర్మీ సిబ్బంది సెలెక్షన్ చేపట్టారు. లిటిల్ జీనియస్ స్కూల్ కరస్పాండెంట్ బండి మహాదేవ్ మాట్లాడుతూ పిల్లలకు క్రమశిక్షణ, నైపుణ్యత, సేవాభావం, సైనికుల శిక్షణ ద్వారా అభివృద్ధి చేయాలని దేశంపై ప్రేమాభిమానాలను పెంపొందించాలని చెప్పారు. ఈ కార్యాక్రమంలో స్కూల్ యాజమాన్యం, హై స్కూల్ ప్రిన్సిపాల్ కే రాధాకృష్ణ, ప్రీ ప్రైమరీ ప్రిన్సిపాల్ కటుకం రాణి, ప్రైమరీ ప్రిన్సిపాల్ కె. వినోద, చీఫ్ అడ్వైజర్ కటుకం శంకర్ థర్డ్ ఆఫీసర్ సంగ మహేష్ పాల్గొన్నారు. విద్యార్థులకు సేవాభావం సహాయస్పూర్తి పెంచాలని సూచించారు.



