కోరుట్ల లో గంజాయి పట్టివేత

viswatelangana.com
జగిత్యాల జిల్లా కోరుట్ల లో 03-04-2024 రోజున సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయములో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోరుట్ల సీఐ బి. సురేష్ బాబు ఈ క్రింది వివరాలు తెలియపరుస్తూ మహమ్మద్ షబ్బీర్, 42 సంవత్సరములు, R/o హాజీపూర, కోరుట్ల అనునతను నిన్నటి రోజున అనగా తేదీ: 02-04-2024 రోజున తన యొక్క TS-02-ED-0698 నెంబర్ గల బైక్ పైన నిజామాబాద్ కు వెళ్లి అక్కడ ఉస్మాన్ R/o నిజామాబాద్ అనునతని వద్ద నుండి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి దానిని కోరుట్ల మరియు పరిసర ప్రాంతాలలో గంజాయిని ఎక్కువ ధరకు అమ్ముకోవడానికి తన టూ వీలర్ బైక్ పై తీసుకొని వస్తుండగా కోరుట్ల ఎస్సై కే.శ్వేత మరియు వారి సిబ్బంది కోరుట్ల పట్టణ శివారులో గల వెటర్నరీ కాలేజీ ముందర వాహనాలు తనిఖీ చేయుచుండగా నిందితుడు వద్ద నుండి 210 గ్రాముల గంజాయితో పట్టుబడడం జరిగినది. ఈరోజు నిందితుడిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించనైనది. ఈ విషయంగా కోరుట్ల సీఐ తెలియపరుస్తూ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని వాటికి అలవాటు పడి వారి విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఇలాంటి అమ్మకం దారులు ఎవరైనా ఉంటే వారి యొక్క వివరాలు పోలీసువారికి తెలియపరచాలని అటువంటి సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, ఇలాంటి నిషేధిత గంజాయి మరియు ఇతర నిషేధిత మాదక ద్రవ్యాలను అమ్మిన, కొన్న, వినియోగించిన అలాంటి వారు కటినమైన చట్టాలతో శిక్షించబడతారని ఈ సందర్భంగా కోరుట్ల సీఐ బి.సురేష్ బాబు సూచించనైనది.



