కోరుట్ల

కోరుట్లకు ఐదు ఎకరాల కొత్త క్రీడా మైదానం స్థలానికి మంజూరు, క్రీడా అభివృద్ధికి కాంగ్రెస్ నేత జువ్వాడి నర్సింగరావు కృషి ప్రశంసనీయం

viswatelangana.com

June 16th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల పట్టణంలో క్రీడాకారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని, నూతన క్రీడా మైదాన నిర్మాణానికి ఐదు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు మంజూరు చేయించారు. ఇటీవలి రోజుల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన జువ్వాడి రత్నాకర్ రావు స్మారక క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా క్రీడాకారులు మైదానం లేని ఇబ్బందులపై నర్సింగరావు దృష్టికి తీసుకెళ్లగా,వెంటనే స్పందించిన ఆయన క్రీడా మైదాన స్థల మంజూరుకు తగిన కృషి చేశారు. ఆ క్రమంలో కోరుట్ల పట్టణంలోని వెటర్నరీ కళాశాల వద్ద క్రీడా మైదానానికి ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రభుత్వం నుంచి మంజూరు చేయించారు. ఈ స్థలాన్ని సోమవారం రోజున ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు గారితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇది స్థానిక క్రీడాకారుల కల నెరవేరే దిశగా ఒక గొప్ప ముందడుగని. యువతకు ప్రోత్సాహం ఇచ్చే దిశగా ప్రభుత్వంతో కలిసి మరిన్ని సౌకర్యాలు తీసుకురావటానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

Back to top button