
viswatelangana.com
September 9th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వాలీబాల్ ఇన్విటేషన్ టోర్నమెంట్ కీ.శే. శశిధర్ ఏఆర్. డిఏస్పీ స్మారకర్థం మెన్ అలాగే ఉమెన్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్న మెంట్ ను ప్రారంభించిన కోరుట్ల సీఐ. సురేష్ బాబు, ఈ టోర్న మెంట్ లో మెన్ విభాగంలో ఎస్.ఆర్.ఆర్ కరింనగర్ వర్సస్ కోరుట్ల జట్టులు తలపడగా, కోరుట్ల జట్టు విజయం సాధించింది. మెన్ విభాగంలో చింత కుంట కరీంనగర్ ఏ టీమ్ మరియు బిటీమ్ చింతకుంట తలపడగా ఏ చింతకుంట విజయం సాధించింది. ఫైనల్ కు చేరుకున్న జట్లను డీఎస్పీ ఉమా మహేశ్వర రావు పరిచయం చేసుకున్నారు. అలాగే విజయం సాధించిన జట్లను అభినందించిన కోరుట్ల సిఐ సురేశ్ బాబు, ఎస్ఐ శ్రీకాంత్, ఈ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ గా ఎంఎ. భారీ, సి.హెచ్ లక్ష్మి నారాయణ, వి. గంగాధర్ లు ఉన్నారు.



