కోరుట్ల
కోరుట్లలో శ్రీ దేవీ నవరాత్రుల సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ను ఆహ్వానించిన గణేష్ నవదుర్గ మండలి

viswatelangana.com
October 1st, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణంలో గణేష్ నవదుర్గ మండలి ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీ దుర్గా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ని ఆహ్వానించిన గణేష్ నవదుర్గ మండలి అధ్యక్షులు కటుకం గణేష్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ దుర్గాదేవి నవరాత్రులు ఎంతో వైభవంగా జరుపుకోవాలని, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి, దేవి అనుగ్రహానికి పాత్రులు కాగలరని, ప్రజలందరూ సుఖసంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని దేవీ నవరాత్రులు ఘనంగా జరుపుకొని, సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు దారిశెట్టి రాజేష్, పేర్ల సత్యం, పొట్ట సురేందర్, మండలి కోశాధికారి ఆడువాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.



