కథలాపూర్
కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ జిల్లా జాయింట్ సెక్రెటరీగా తాలూకా మల్లేష్ నియామకం
viswatelangana.com
February 19th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలానికి చెందిన తాలూకా మల్లేష్ ను కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ (పౌర మరియు మానవ హక్కుల సంస్థ ngo )జగిత్యాల జిల్లా జాయింట్ సెక్రటరీగా నియమిస్తూ రాష్ట్ర కార్యదర్శి భూక్యాచరణ్ కాంత్ నియామక పత్రం అందజేశారు నూతనంగా నియమితులైన మల్లేష్ మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర కార్యదర్శి ధన్యవాదాలు తెలిపారు అలాగే ఆర్టిఐ ఆర్ట్ 2005 అనే చట్టం సామాన్యుని చేతిలో వజ్రాయుధమని తెలిపారు ప్రభుత్వాలు ఖర్చు చేసిన ప్రతి రూపాయిని తెలుసుకోవడం ప్రజల బాధ్యతగా భావించాలన్నారు. అవినీతి అంతం సి సి ఆర్ పంతమని మల్లేష్ వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చరణ్ కాంత్, జిల్లా సెక్రటరీ గంగరాజాం, జహంగీర్, జక్కుల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.



