కోరుట్ల
గడి పాఠశాలలో పోషణ పక్వడా కార్యక్రమం…

viswatelangana.com
April 23rd, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
ప్రాథమిక పాఠశాల యస్ ఆర్ యస్ పి క్యాంప్ గడి కల్లూరు రోడ్ కోరుట్ల పాఠశాలలో విద్యార్థులచే అంగన్ వాడి కార్యక్రమంలో భాగంగా పోషణ పక్వాడా కార్యక్రమం దేశీయ బొమ్మలు, చిత్రాలు, ఆట ఆధారిత అభ్యసనం, మనం నిత్య జీవితంలో వాడే కూరగాయలు వాటి పోషక విలువల పై విద్యార్థులచే వ్యాస రచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఇందులో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు, ఉపాధ్యాయులు పూర్ణ చందర్, సురేఖ, సురేందర్, ధన లక్ష్మి, సుమలత, అంగన్వాడి టీచర్లు హిమగిరి, లక్ష్మి,అరుణ, ప్రేమలత, ప్రసన్న లక్ష్మి, రాజమని, పద్మ తదితరులు పాల్గొన్నారు.



