గణనాథుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన జువ్వాడి నర్సింగ్ రావు

viswatelangana.com
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కోరుట్ల పట్టణ భీముని దుబ్బ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించిన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని టెంకాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగ్ రావు మాట్లాడుతూ… పూజల్లో ప్రథమ పూజను ఆదిదేవుడు అయిన గణనాథుడికి ముందుగా చేయడం జరుగుతుందని, అలాంటి గణనాథుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ గణనాథుని కృపా కటాక్షం వల్ల అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని తెలిపారు. ఈకార్యక్రమంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మచ్చ కవిత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజిరెడ్డి, పాక్స్ ఛైర్మన్ భూమారెడ్డి, కౌన్సిలర్ ఎంబేరి నాగభూషణం, తిరుమల వసంత గంగాధర్, గంధం గంగాధర్, నాయకులు పుప్పాల ప్రభాకర్, ఆడెపు మధు, సంఘ లింగం, వెంకటేశం, ముత్యాల గంగాధర్, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, యువకులు మహిళలు, చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు.



