గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిరుపేదలకు, వృద్ధులకు నిత్యవసర సరుకులు పంపిణి

viswatelangana.com
కోరుట్ల మండలం యూసుఫ్ నగర్ గ్రామానికి చెందిన సింహాసేన యూత్ అలాగే వారి మిత్రబృందం ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినుత్నంగా కొత్త ఆలోచనకు తెరదీసి ఏమి లేని నిరుపేదలకు & వృద్ధులకు నిత్యవసర వస్తువులు అన్నదానానికి సంబంధించిన బియ్యం మరియు కూరగాయలు 5 వేల రూపాయలు విలువ చేసే వస్తువులను ఇటిక్యాల శివారులోని నివేదిత వృద్ధశ్రమనికి బుధవారం రోజున యూత్ సభ్యులు మరియు మిత్ర బృందం సభ్యులు అందించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ డైరెక్టర్ గుగ్గిళ్ల సురేష్ గౌడ్ మాట్లాడుతూ…అన్నదానం అంటే ఆర్థికంగా అన్ని ఉన్న ప్రజలకు చేయడం కాకుండా ఎమి లేని నిరుపేదలకు, వృద్ధులకు ఇలాంటి ధానం చేయాలని సంకల్పించడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఈ నిత్యవసర వస్తువుల పంపిణీకి సహకరించిన సింహసేన యూత్ సభ్యులకు అలాగే మిత్రులందరికీ పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్ సురేష్ గౌడ్, సింహా సేన యూత్ సభ్యులు కరిపే నరేష్, తుది గేని సాయికుమార్, అమందు రఘు, పంతంగి అంజయ్య, రాజేందర్, మిత్రబృందం సభ్యులు గుగ్గిళ్ళ శ్రీనివాస్, అచ్చ చంద్రశేఖర్, బర్ల సుధీర్, కషావత్రి కళ్యాణ్ నివేదిత వృద్ధాశ్రమం నిర్వాహకులు, మహిపాల్ రెడ్డి అలాగే వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.



