భీమారం
గల్ఫ్ కార్మికుడికి ఆపన్న హస్తం అందించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

viswatelangana.com
March 28th, 2025
భీమారం (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని భీమారం మండలంలోని మన్నెగూడెం గ్రామానికి చెందిన జమ్మికుంట మహేందర్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.. సంబంధిత సమస్యపై వైద్యులను సంప్రదించగా కిడ్నీ మార్పిడి చేయవలసిందిగా వైద్యులు తెలుపగా అనారోగ్య సమస్యల వలన అత్యవసర చికిత్స అవసరం ఉన్నదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి తెలియజేయగానే తక్షణమే స్పందించి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలోని వైద్య సిబ్బందితో చర్చలు జరిపి ప్రత్యేకమైన చికిత్స అందించవలసిందిగా ఆదేశిస్తూ అలాగే ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయంగా వెంటనే వైద్య ఖర్చులకు 5 లక్షల రూపాయలు మంజూరు చేపించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అత్యవసర ఆరోగ్య చికిత్స నిమిత్తం ఎల్ఓసి మంజూరు చేయించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.



