మెట్ పల్లి

గీతా సత్సంగ్ ఆధ్వర్యంలో -79 వ జ్ఞాన యజ్ఞం హనుమాన్ చాలీసా

viswatelangana.com

October 20th, 2024
మెట్ పల్లి (విశ్వతెలంగాణ) :

గీతా సత్సంగ్ మెట్ పల్లి వారి ఆధ్వర్యంలో ఆదివారం 79 వ జ్ఞాన యజ్ఞంలో భాగంగా హనుమాన్ చాలీసా యజ్ఞం సమాపన కార్యక్రమం కమ్మర్ పల్లి పాటి హనుమాన్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ గీతా ప్రఛారక్, మెట్ పల్లి గీతా సత్సంగం వ్యవస్థాపకులు చీలమంతుల ఛత్రపతి గురూజీ, మెట్ పల్లి ఖాదీ హనుమాన్ దేవాలయంలో క్లాస్ లు పూర్తి చేసి సమాపన చేసారు. ఈ కార్యక్రమంలో గణపతి భజన, గురు ప్రార్థన, విష్ణు సహస్ర నామ పారాయణం, హనుమాన్ చాలీసా, భజనలు, ముఖ్య వక్తలుగా బెజ్జరాపు మురళి రిటైర్డ్ టీచర్, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ టి.ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు అల్లకట్టు సత్యనారాయణ, మర్రి భాస్కర్, గాదే రమేష్, మహాజన్ హరీష్, నందయ్య, లక్ష్మీ, సంతోషి, తోపారపు రాజేంధర్, రవి, గజవాడ గంగాధర్, ఇల్లేందుల కిషన్ భూమయ్య, మంచాల శ్రీమన్నారాయణ, లవ కుమార్ భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button