గుగ్లావత్ చిరంజీవి నాయక్ ఏకగ్రీవంగా ఎన్నిక……

viswatelangana.com
ఆదివారం రోజున అల్ ఇండియా బంజారా సేవ సంఘ్ కార్యకర్తల సమావేశం శివాజీ ఫంక్షన్ హాల్ రాయికల్ లో జిల్లా అధ్యక్షులు భూక్యా గోవింద్ నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రాయికల్ మండల శాఖ అధ్యక్షులుగా గుగ్లావత్ చిరంజీవి నాయక్, ప్రధాన కార్యదర్శిగా భూక్యా శంకర్ నాయక్ లను ఏకగ్రీవంగా ఎన్నిక చేసినట్లు జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భుక్యా గోవింద్ నాయక్, బానోత్ రమేష్ నాయక్ లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ బంజారా జాతి అన్ని రంగంలో వెనుక బడినది అని,జాతి ప్రజలకు ఏ సమస్య వచ్చిన ముందు ఉండి పోరాటం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రాయికల్ కేంద్రంగా చేసుకొని గిరిజన ఏజెన్సీ ప్రాంతంగా (ఐ టి డి ఎ)గా ఏర్పాటు చేయాలని కోరారు.ఇట్టి కార్యక్రమంలో భూక్యా రాకేష్ నాయక్, మలోత్ తిరుపతి నాయక్, బానోత్ రవి నాయక్, పల్త్యా ప్రభాకర్, మలోత్ నరేందర్, అజ్మీరా భూమా నాయక్, పరశురామ్, శ్రీనివాస్, రాజేందర్, సురేష్, భూమా నాయక్, దశరథ్ బలరాం తదితరులు పాల్గొన్నారు.



