కోరుట్ల
గెస్ట్ లెక్చరర్స్ సమస్యలపై మంత్రికి వినతి

viswatelangana.com
October 5th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కోరుట్ల లో జరిగిన మాజీ మంత్రి, కీర్తిశేషులు జువ్వాడి రత్నాకర్ విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ను, జగిత్యాల గెస్ట్ లెక్చరర్స్ జిల్లా అధ్యక్షులు గుర్రాల సాయికృష్ణ అధ్వర్యంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సాయికృష్ణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేనిఫెస్టో లో పేర్కొన్న విధంగా 42,000 వేల జీతంతో పాటు, 12 నెలల కన్సాలిడేటెడ్ పే, ఉద్యోగ భద్రత మరియు జిల్లాల్లో తగ్గిన పోస్ట్ లను మళ్ళీ యధావిధిగా పెంచాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి సమస్యలను త్వరగానే పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం లో శంకరయ్య, శిరీష,నాగేశ్వర్, రాజశేఖర్, అరుణ్, సుధీర్, వినీత, కావ్య తదితరులు పాల్గొన్నారు.



