రాయికల్

గోరింటాకు సంబరాలు

viswatelangana.com

July 4th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని విశ్వశాంతి పాఠశాలలో ఆషాడ మాసంలో భాగమైన “గోరింటాకు సంబరాలు” అంబరాన్ని అంటాయి. విద్యార్థినులందరూ గోరింటాకు పెట్టుకుని ఎంతోఆనందోత్సహాలతో కేరింతలు కొట్టారు. పాఠశాల ప్రిన్సిపల్ మచ్చ గంగాధర్ మాట్లాడుతూ గోరింటాకు యొక్క విశిష్టత మరియు గోరింట పూచింది కొమ్మ లేకుండా.. ఇలా పాడుకుంటూ అందంగా మురిసిపోతారు మహిళలు ఆషాడ మాసంలో.. మిగతా రోజుల్లో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా.. ఆషాడంలో ప్రతి ఆడపిల్ల తమ చేతులు, కాళ్ళకి అందంగా గోరింటాకు పెట్టుకుని మురిసిపోతుంటారు. మన వాతావరణం ప్రకారం ఆషాడంలో వర్షాలు పడుతుంటాయి. దీంతో వాతావరణం అంతా చల్లగా మారుతుంది. అంతేనా, సూక్ష్మక్రిములు పెరిగి అంటురోగాలు వ్యాపిస్తాయి. కావున అందరూ గోరింటాకు పెట్టుకోవడం వలన సూక్ష్మ క్రిముల నివారణలో భాగమవుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు మచ్చ లలిత, విద్యాన్వేష్ మరియు ఉపాధ్యాయులు మహేష్, రంజిత్, అప్సర్, షారూ, రజిత, సంజన, ఇందుజ, మంజుల, శ్రీజ, మమత, అపర్ణ, సౌజన్య, నాగరాణి, నిహారిక, కవిత, లావణ్య, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button