రాయికల్

గోరింటాకు సంబరాలు

viswatelangana.com

July 5th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలోని శ్రీ గ్రీన్ వుడ్ పాఠశాలలో ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని గోరింటాకు సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ మిట్టపల్లి మహేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వచ్చే ఆషాడమాసంలో గోరింటాకు పెట్టుకోవడం అది ఒక శాస్త్ర రీత్యా ఔషధంగా పనిచేస్తుందని వివరించారు. వర్షాకాలంలో వచ్చే అంటు వ్యాధులు ప్రబలకుండా కాళ్లు, చేతులకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల రక్షణ కలుగుతుందని వివరించారు. వర్షాలు కురవడం వల్ల భూమిలో ఉన్న వేడి పోతుందని అలాగే శరీరంలో ఉన్న వేడి పోవాలంటే గోరింటాకు ఆషాడమాసంలో పెట్టుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుందని అందుకే మహిళలు, బాలికలు ఆషాడ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కాకర శ్రీనివాస్ రెడ్డి,హెడ్మాస్టర్ రాజేష్, అకడమిక్ డైరెక్టర్ యజ్ఞ శ్రీ,అనిత, మరియు టీచర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button