గౌతమ్ మోడల్ స్కూల్లో ఘనంగా యోగా దినోత్సవం వేడుకలు

viswatelangana.com
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని గౌతమ్ మోడల్ స్కూల్లో యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం పాఠశాలలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులలో వివిధ ఆకృతులలో ఆసనాలు వేయించడం జరిగింది.పాఠశాల చైర్మన్ వెంకట్ నారాయణ మాట్లాడుతూ యోగా చేయడం వలన శారీరక దారుడ్యం ఏర్పడుతుందని, ధ్యానయోగం ద్వారా ఆధ్యాత్మిక సాధనకు మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడ్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ వెంకట్ నారాయణ, ప్రిన్సిపాల్ జే ప్రవీణ్ కుమార్, డీన్ నరసింహ రాజు, డైరెక్టర్ శ్రీకాంత్, వ్యాయామ ఉపాధ్యాయుడు ముదాం ప్రవీణ్, హై స్కూల్ ఇంచార్జ్ రాజశ్రీ, ప్రైమరీ ఇంచార్జ్ స్రవంతి, ప్రీ ప్రైమరీ ఇంచార్జ్ శాంతి,స్వరూప రాణి, నవత, వందన, నవీన, కిరణ్, తాసిన్, స్రవంతి, మమత, తిరుపతి, కళ్యాణి, అనిల్ కుమార్, ఉజుమా, మహేష్, మమత, రాజశ్రీ, జలజ, వినాయక్, కృష్ణ మాధవి, రాధా, రాణి, శృతి, అకౌంటెంట్ మధుకర్, మోహన్ సింగ్ మరియు డ్రైవర్లు క్లీనర్లు ఆయాలు తదితరులు పాల్గొనడం జరిగింది.



