కోరుట్ల
ఘనంగా కేపీఎస్ వార్షిక క్రీడోత్సవం

viswatelangana.com
April 3rd, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరట్ల పబ్లిక్ స్కూల్ (కెపిఎస్) వార్షిక క్రీడోత్సవాన్ని పోతని భూమయ్య ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. విద్యా సంవత్సరం పూర్తి అవుతున్నందున విద్యార్థులకు మానసిక ఉల్లాసానికి విద్యా సంవత్సరమంతా పాల్గొన్న వివిధ క్రీడలు మరియు క్రీడాపోటీల్లో తమ ప్రతిభను కనబరిచినందుకు గాను మెడల్స్, సర్టిఫికేట్లు మరియు బుహుమతులు తల్లిదండ్రుల సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా కేపీఎస్ కరస్పాండెంట్ గుజ్జెటి వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో క్రీడల ప్రాముఖ్యతను వివరించారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంచటమే కాకుండా, క్రమశిక్షణ, సమూహ భావన, పట్టుదల వంటి విలువలను విద్యార్థుల్లో పెంపొందిస్తాయని వీటి ద్వారా విద్యార్థుల్లో పోటీ తత్త్వం అలవరుచుకొని విద్యలో కూడా ముందుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.



