మల్లాపూర్
ఘనంగా ద్వజస్థంభ ప్రతిష్టాపన మహోత్సవం

viswatelangana.com
February 3rd, 2025
మల్లాపూర్ (విశ్వతెలంగాణ) :
మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలో బైరినేని ప్రదీప్ రావ్-కవిత దంపతులు వారి కుమార్తె అమృత (చిన్మయి) ల ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ద్వజస్థంభ ప్రతిష్టాపన, యంత్రస్థాపన, అష్ట భలిహరణం, పూర్ణ హుతి, అన్నదానం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం, శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం మూడు దేవాలయాలలో మకర తోరణ ప్రతిష్టా కార్యక్రమాలను ధర్మపురి వేద పండితులచే అంగరంగ వైభావంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో..గ్రామ ప్రజలు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.