రాయికల్
ఘనంగా హిందీ దివస్ వేడుకలు

viswatelangana.com
September 14th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జోగిన్పలి లో హిందీ దివస్ ఘనంగా నిర్వహించారు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంబటి వెంకటరాజం మాట్లాడుతూ హిందీ భాష నేర్చుకుంటే మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పారు పోస్టర్, ఉపన్యాసం, కవితలు, పద్యాలు వివిధ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు హిందీ ఉపాధ్యాయులు యం.డి. ఫసిఉదీన్ మాట్లాడుతూ హిందీ భాష విశ్వ భాష గా మారిందని హిందీ భాష సేవా దేశ సేవ అని మహాత్మా గాంధీ అన్నారు అని చెప్పారు విజేత లకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లక్ష్మన్,వెంకట సుదీర్, యుగంధర్ రాజు, తిరుపతి, రాం నరేశ్, జ్యోతి లక్ష్మి పాల్గొన్నారు అందరూ మాట్లాడుతూ హిందీ దివస్ శుభాకాంక్షలు తెలిపారు



