కోరుట్ల
ఘనంగా హోలీ సంబరాలు
viswatelangana.com
March 25th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ప్రకాశం రోడ్డులో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఉదయం నుండి చిన్నారులు, మహిళలు, పురుషులు, యువతి యువకులు అందరూ కూడా రంగులు ఒకరికొకరు చల్లుకుని హోలీ వేడుక చేసుకున్నారు. ఈ వేడుకలతో పలు ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది.



