చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు..

viswatelangana.com
కోరుట్ల పట్టణ ఆదర్శ నగర్ లో గల శ్రీఅష్టలక్ష్మీ సహిత శ్రీలక్ష్మి నారాయణ స్వామి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలో భాగంగా శుక్రవారం చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు ఇందులో భాగంగా ముందుగా శ్రీ సూక్త లక్ష్మీ హోమం శ్రీ హోమం ఆరోగ్య వృద్ధి కై ఔషధాలతో స్వామివారికి అభిషేకం సముద్రాల శ్రీరామాచార్యుల వైదిక నిర్వహణలో నిర్వహించారు. అనంతరం సాయంత్రం స్వామివారి రథోత్సవం సందర్భంగా మహిళలు స్వామివారికి మంగళహారులతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అధ్యక్షులు బూరుగు రామస్వామి గౌడ్ మాట్లాడుతూ శరన్నవరాత్రోత్సవాలకు అన్ని బత్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేపట్టమని ఇందులో భాగంగా ముందుగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, శ్రీ సూక్త లక్ష్మీ హోమం నిర్వహించమన్నారు. ఈకార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు బురుగు రామస్వామి సుభద్ర దంపతులతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు ఇందుర్తీ మధుసూదనా చారి, శ్రీపెరంబుదురి శ్రీనివాస్, సముద్రాల శ్రీరామాచార్యులు, అభిరామాచార్యులు, శ్రీకాంతాచార్యులు, ఎలిశేట్టి భూమారెడ్డి, చౌటుకురి అంజయ్య, ముత్యాల గంగాధర్, వెంకటేశ్వర్ రావు, ఇల్లేందుల వెంకట్రాములు, కోటగిరి మహేశ్, నవీన్, నల్ల గంగాధర్, నర్సయ్య, శ్రీనివాస్, కిరణ్, రమేష్, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.



