చలివేంద్రం ప్రారంభం…

viswatelangana.com
కోరుట్ల పట్టణ 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చిట్యాల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక వార్డులో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా ఇట్టి చలివేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు ప్రారంభించారు. అనంతరం జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు మునుముందు మరెన్నో చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావుతో పాటు కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, కాంగ్రెస్ పార్టీ నాయకులు పుప్పాల ప్రభాకర్, ఆడెపు మధు, సంఘ లింగం, ఎతిరాజం నర్సయ్య, 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చిట్యాల లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు, పాల్గొన్నారు.



