రాయికల్
చిన్ననాటి మిత్రుల హోలీ సంబరాలు

viswatelangana.com
March 14th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1993-94 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన చిన్ననాటి మిత్రులు ఒకచోట చేరి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందోత్సవాలతో ఒకరినొకరు రంగులు చల్లుకొని ఆనందంగా హోలీ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అందరూ ఒక ప్రదేశంలో కూర్చొని ఆనందంగా ముచ్చటిస్తూ సరదాగా గడిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితం రంగుల మయం కావాలని ఆకాంక్షించారు.



