జగిత్యాల
జగిత్యాల జిల్లాలో ఈ నెల 22 న సెలవు ప్రకటించాలి. తపస్.
viswatelangana.com
January 19th, 2024
జగిత్యాల (విశ్వతెలంగాణ) :
ఈనెల 22 సోమవారం రోజున అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రతిష్టాపనోత్సవం సందర్భంగా సెలవు ప్రకటించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ జగిత్యాల జిల్లా శాఖ కోరింది.. ఈ మేరకు జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్. లత ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశమంతా ఆరోజు పండుగ వాతావరణం ఉంటుంది కావున సెలవు ప్రకటించాలని వారు విజ్ఞప్తి చేశారు.. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోనగిరి దేవయ్య.. బోయినపల్లి ప్రసాదరావు.. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు అయిల్నేని నరేందర్ రావు.. జిల్లా ఆర్థిక కార్యదర్శి గడ్డం మైపాల్ రెడ్డి.. మండల నాయకులు రఘునందన్.. రజనీకాంత్.. శ్రీనివాసరావు.. తదితరులు పాల్గొన్నారు.




6edwa8