కథలాపూర్
జాతీయ బీసీ సంక్షేమ సంఘం కథలపూర్ మండల అధ్యక్షులుగా పులి హరిప్రసాద్ నియామకం

viswatelangana.com
May 20th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ మండలకేంద్రంలో గల జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజాల శ్రీనివాస్ గౌడ్ మరియు జగిత్యాల జిల్లా అధ్యక్షులు బ్రహ్మండబేరి నరేష్ ఆదేశాల మేరకు బీసీ సంక్షేమ సంఘం కథాలాపూర్ మండల అధ్యక్షునిగా పులి హరిప్రసాద్ ను నియమిస్తూ జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ నల్ల వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకంలో రాష్ట్ర కార్యదర్శి బొమ్మేళ శంకర్, జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ నల్ల వెంకటేశ్వర్లు, కోరుట్ల పట్టణ అధ్యక్షులు బాలే అజయ్, కోరుట్ల పట్టణ మహిళా అధ్యక్షురాలు జిల్ల మమత, ఉపాధ్యక్షులు బాలే మహేష్, జనరల్ సెక్రెటరీ ఎడ్ల శ్రీశైలం, సభ్యుల కునరపు గణేష్, పెద్ది అనీల్, భార్గవ్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



