మెట్ పల్లి

జాతీయ సేవా పథకం దినోత్సవ కార్యక్రమం

viswatelangana.com

September 24th, 2024
మెట్ పల్లి (విశ్వతెలంగాణ) :

ప్రభుత్వ జూనియర్ కళాశాల మెట్ పల్లి లో జాతీయ సేవా పథకం దినోత్సవ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ ఆర్ వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ ఈ జాతీయ సేవా పథకము 1969 సెప్టెంబర్ 24న మహాత్మా గాంధీ శత జయంతి సందర్భంగా ప్రారంభించడం జరిగిందని, ప్రతి ఒక్క విద్యార్థి చదువుతోపాటు సమాజంలో వివిధ రకాల వృత్తుల పట్ల గౌరవాన్ని కలిగి సేవా భావాన్ని పెంపొందించుకోవాలని, ప్రతి ఒక్క ఎన్ఎస్ఎస్ వాలాంటిర్ కళాశాల పరిసరాలను, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు, సమాజంలో జరుగుతున్న దురాచారాల పట్ల, మూఢనమ్మకాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం కళాశాల జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారి గోవిందుల వెంకటేష్ ను ప్రిన్సిపాల్ అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి గోవిందుల వెంకటేష్ అధ్యాపకులు సిహెచ్. శ్రీనివాస్, జగపతి, శ్రీనివాస్, మహేశ్వరి, నర్సయ్య, రాజేశ్వరరావు, సుదర్శన్, ప్రతిభ, స్వర్ణలత, మంజుల, కిరణ్ కుమార్, జాకీర్, నవీన్ కుమార్, జమున, మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button