జిల్లా సేవాదళ్ అధ్యక్షులు నాయిని సురేష్ కు సన్మానం…

viswatelangana.com
కోరుట్ల పట్టణం జువ్వాడి కృష్ణారావు స్వగృహం జువ్వాడి భవన్లో కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జగిత్యాల జిల్లా నూతన అధ్యక్షులుగా నియతులైన నాయిని సురేష్ ని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన కోరుట్ల పట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ నేతలు అనంతరం జిల్లా సేవాదళ్ నూతన అధ్యక్షునిగా నియమితులైన నాయిని సురేష్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావుతో పాటు కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదా నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.



