జువ్వాడి రత్నాకర్ రావు కాంస్య విగ్రహ ఆవిష్కరణ

viswatelangana.com
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోనీ మాజీ మంత్రి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు కాంస్య విగ్రహాన్నీ ఆవిష్కరించిన ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రాంత అభివృద్ధికి మాజీ మంత్రి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు ఎనలేని కృషి చేశారని ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు, స్థానిక నాయకులతో కలిసి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ……. ప్రాంతాలకు అతీతంగా ఎక్కడ ఏ సమస్య వచ్చిన ముందుండి మాట్లాడిన వ్యక్తి జువ్వాడి రత్నాకర్ రావు అని,ఆయన ఈ ప్రాంతానికి చేసిన సేవలు మరువలేనివని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేశారని,సీనియర్ నాయకుడిగా ఆయన చూపిన మార్గంలో నడుస్తామని తెలిపారు.జువ్వాడి రత్నాకర్ రావు ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని, ఆయన లేని లోటు తీర్చలేనిదని చెప్పారు.ఈ సందర్భంగా రత్నాకర్ రావు కి ఘనంగా నివాళ్ళు అర్పిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, డా.సంజయ్ కుమార్,బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కుమార్,ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరపెల్లి మోహన్, కొండూరి రవీంధర్ రావు, కూన శ్రీశైలం గౌడ్, బొమ్మ శ్రీశైలం గౌడ్ బొమ్మ శ్రీరామ్ జగిత్యాల, కోరుట్ల మున్సిపల్ చైర్మన్లు అలువాల జ్యోతి అన్నం లావణ్య, కథలాపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాయితీ నాగరాజు, ఎండీ అజీమ్, వెగ్యారపు శ్రీహరి, తొట్ల అంజయ్య, దేవారెడ్డి, తలారి మోహన్, నారాయణ రెడ్డి, లింగారావు, శేఖర్, ముదాం శేఖర్, భూపెల్లి రాజగంగారాం, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



