రాయికల్
జూనియర్ సుధా చంద్రన్ ను సన్మానించిన పాఠశాల యాజమాన్యం

viswatelangana.com
April 26th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
అంగవైకల్యం దేనికి అడ్డు రాదని ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించవచ్చని నిరూపించిన రాయికల్ మండలం రామాజీపేట గ్రామానికి చెందిన బొమ్మ కంటి అంజన శ్రీని ప్రగతి పాఠశాల యాజమాన్యం శాలువా మెమొంటోతో ఘనంగా సన్మానించారు. ఆశాంకుర కల్చరల్ డే వేడుకల్లో పాల్గొని భరతనాట్యం ప్రదర్శించిన అంజన శ్రీని ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలె శేఖర్ మాట్లాడుతూ ఒకే సంవత్సరంలో 50 ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు గచ్చిబౌలిలో జరిగిన కార్యక్రమంలో వరల్డ్ గిన్నిస్ బుక్ లో పేరు నమోదు చేసుకోవడం గొప్ప విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో అంజన శ్రీ తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.



