Uncategorized

జూలై 1 నుంచి ఆధార్ ధృవీకరణతోనే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్‌లో తత్కాల్ టికెట్ల బుకింగ్

viswatelangana.com

June 11th, 2025
Uncategorized (విశ్వతెలంగాణ) :

తత్కాల్ టికెట్లపై న్యాయమైన, పారదర్శక అవకాశాలు కల్పించేందుకు, భారతీయ రైల్వే కీలక మార్పులను ప్రకటించింది. ఇవి తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మోసాలు తగ్గించి, నిజమైన ప్రయాణికులకు ఉపయోగపడేలా ఉంటాయి. జూలై 1 నుంచి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్‌ ద్వారా తత్కాల్ టికెట్లు బుక్ చేయాలంటే ఆధార్ ఆధారిత ధృవీకరణ తప్పనిసరి. జూలై 15 నుంచి ఆన్‌లైన్ బుకింగ్‌కు ఆధార్ ఆధారిత ఓటీపీ ధృవీకరణ తప్పనిసరి. పీఆర్‌ఎస్ కౌంటర్లు మరియు ఏజెంట్ల ద్వారా బుకింగ్ చేసేటప్పుడు కూడా, ప్రయాణికుడి మొబైల్ నంబరుకు ఓటీపీ పంపి ధృవీకరించాలి. ఇది జూలై 15 నుంచి అమలులోకి వస్తుంది. ఏజెంట్లకు బుకింగ్‌పై సమయ పరిమితి ఈ విధంగా ఉన్నాయి: ఏసీ క్లాసుల బుకింగ్ ఉదయం 10:00 నుంచి 10:30 వరకు ఏజెంట్లకు అనుమతి ఉండదు. నాన్-ఏసీ క్లాసుల బుకింగ్ ఉదయం 11:00 నుంచి 11:30 వరకు ఏజెంట్లకు అనుమతి ఉండదు. ఈ మార్పులు తత్కాల్ టికెట్ వ్యవస్థను నిష్పక్షపాతంగా, మోసాల్లేని విధంగా మార్చడమే లక్ష్యం. ప్రయాణికులు తమ IRCTC ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది.

Back to top button