కోరుట్ల

టిపిసిసి అధ్యక్షుడిని సన్మానించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు

viswatelangana.com

September 25th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ (టి పి సి సి) అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు గాంధీభవన్లో కలిసి సన్మానించారు. ఇటీవలే నూతనంగా నియమితులైన పిసిసి అధ్యక్షునికి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షునికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గాంధీభవన్లో ఏర్పాటుచేసిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి కోరుట్ల నియోజకవర్గంలోని 100 పడకల ఆసుపత్రికి సంబంధించిన 54 మంది వైద్య సిబ్బంది ఇతర టెక్నికల్ సిబ్బంది డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటన్నింటిని తక్షణం భర్తీ చేయాలని అలాగే వైద్య పరికరాలు కూడా తక్షణం ఆసుపత్రికి మంజూరు చేయాలనీ వినతి పత్రం అందజేశారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారని జువ్వాడి కృష్ణారావు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు.

Related Articles

Back to top button