కోరుట్ల
డా. బి.ఆర్. అంబేడ్కర్‌కు యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ ఘన నివాళి

viswatelangana.com
April 14th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేడ్కర్ జయంతి సందర్భంగా యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ తరఫున కోరుట్లలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డా. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ఆయనకు స్మరణాంజలిని సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముహమ్మద్ ముజాహిద్, ఎపిజె అధ్యక్షుడు మహమ్మద్ నాసిర్, మినా మస్జిద్ అధ్యక్షుడు బారీ, రియాజ్, అద్నాన్ షకీల్, నజీబ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముజాహిద్ మాట్లాడుతూ, డా.బి ఆర్ అంబేడ్కర్ ఓ వ్యక్తి మాత్రమే కాదు, ఆయన ఒక ఆలోచన. సమానత్వం, న్యాయం, విద్య వంటి మూల్యాలను ఆయన అందించారు. ఆయన రూపొందించిన రాజ్యాంగం మనకు మార్గదర్శకం. మైనారిటీల హక్కుల కోసం, ప్రతి పేదవాడి గొంతుకగా నిలబడేందుకు మనం ప్రతినిత్యం కృషి చేయాలి అని అన్నారు.



