రాయికల్
డాక్టరేట్ అవార్డు గ్రహీతను సన్మానించిన యువజన సంఘాల సభ్యులు

viswatelangana.com
June 2nd, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
సామాజిక సేవా విభాగంలో ఇటీవల టొలాసా అమెరికా యూనివర్సిటీ డాక్టరేట్ అవార్డు ప్రదానం చేయగా అవార్డు గ్రహీత డాక్టర్ కాయితి శంకర్ ను ధర్మాజీపేట యువజన సంఘాల సభ్యులు సోమవారం ధర్మాజీపేట గ్రామపంచాయతీ భవనంలో శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మాజీ ఉపసర్పంచ్ పాలకుర్తి వెంకటేష్ మాట్లాడుతూ సమాజ సేవలో నిరంతరం చేసిన కృషికి కాయితి శంకర్ కు డాక్టరేట్ అవార్డు రావడం గ్రామానికే గర్వకారణమని అన్నారు. ఆయన చేసిన కృషి కి తగిన గుర్తింపు లభించిందని ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల నాయకులు మ్యాకల వినోద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.



