కోరుట్ల
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం. ఆధ్వర్యంలో అన్న ప్రసాదన కార్యక్రమం

viswatelangana.com
September 11th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల మండలం కల్లూరు గ్రామంలో అత్యంత వైభవంగా గణపతి మండపంలో పూజా కార్యక్రమం చేసిన అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పాల్గొని, ప్రతి ఒక్కరు విధిగా మట్టి గణపతిని పూజించాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరి తోడ్పాటు అవసరమని ఆది దేవునికి పూజలు చేశారు. ఎమ్మెల్యే వెంట మండల నాయకులు దారిశెట్టి రాజేష్, మెట్పల్లి మాజీ ఎంపీపీ సాయి రెడ్డి, స్థానిక మాజీ సర్పంచ్ వన తడుపుల అంజయ్య తో పాటు సంఘ సభ్యులు మహేందర్, శేఖర్, అజయ్, మనోజ్ కృష్ణ, రాజు, వినయ్, నవీన్, అరవింద్, శీను, అక్షయ్, పవన్, అనిల్, నారాయణ, దిలీప్, గ్రామ ప్రజలు, పుర ప్రముఖులు వివిధ సంఘాల పెద్ద మనుషులు మాజీ ఉపసర్పంచ్. సంకే రాకేష్ పాల్గొన్నారు.



