రాయికల్

డిఏ, పీఆర్సీ బకాయిలు చెల్లించాలి

viswatelangana.com

March 13th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

రాయికల్, భూపతిపూర్ స్కూల్ కాంప్లెక్స్ పరిధి లో పని చేస్తున్న ఉపాధ్యాయుల డీఏ బకాయలు చెల్లించాలని పీఆర్టీయు టీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం రమేష్ ప్రభుత్వాన్ని కోరారు. రాయికల్ లో బుధవారం జరిగిన సంఘ సమావేశం లో ఆయన మాట్లాడుతు ఈ సంత్సరం, తో పాటు గత సంత్సరం డీఏ బకాయలు రాక సీపీఎస్ ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. జిల్లా లో స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు పీఅర్సీ బకాయిలు మూడు మాత్రమే వచ్చాయని, ఇంకా 15 బకాయిలు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి అంతడుపు గంగారాజం, మండల అధ్యక్షులు రాపర్తి నర్సయ్య, ప్రధాన కార్యదర్శి తాటిపాముల రమేష్, కార్యదర్శి దొంతి సతీష్, కడకుంట్ల అభయరాజ్, ఉషకోలా రాము, లక్కడి రాజారెడ్డి, సిలివెరీ రమేష్, సురేందర్, హరికృష్ణ లు పాల్గొన్నారు.

Related Articles

Back to top button