డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బాలుడు మృతి

viswatelangana.com
మంగళవారం రోజునా మధ్యాహ్నం సమయంలో మహబూబాబాద్ జిల్లా వడ్డెర గూడెం గ్రామానికి చెందిన సంపంగి సంగీత భర్త శ్రీను కొడుకు సంపంగి గణేష్ వయస్సు నాలుగు సంవత్సరాలు అను బాలుడు మేడిపల్లి శివారులోని నూతనంగా నిర్మిస్తున్నటువంటి ఎన్నమనేని ప్రణవికి చెందిన పౌల్ట్రీ ఫామ్ లో బాలుడు తల్లిదండ్రులు కూలి పనులు చేస్తుండగా అట్టి బాలుడు అదే పౌల్ట్రీ ఫామ్ లోని నూతనంగా నిర్మించిన సిమెంట్ గోడ నీడలో ఉండగా అదే పౌల్ట్రీ ఫామ్ లో పనిచేస్తున్నటువంటి డ్రైవర్ అమరగోని రాజు తండ్రి వెంకట్రాజ్యం, ( 31) సంవత్సరాలు, గ్రామం దొంగతుర్తి మండలం ధర్మారం పెద్దపల్లి జిల్లాకు చెందిన వ్యక్తి తాను నడిపేటటువంటి కాంక్రీట్ మిక్సర్ వాహనాన్ని అజాగ్రత్తగా నడపగా అట్టి వాహనం సిమెంట్ గోడకు తగిలి గోడ కూలి , అట్టి నీడలో కూర్చున్న బాలుడి తలపై పడగా తల పగిలి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. బాలుడి తల్లి సంపంగి సంగీత ఫిర్యాదు మేరకు ఎస్సై జి శ్యామ్ రాజు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు



