కోరుట్ల
తాళం వేసిన ఇంట్లో చోరీ మూడున్నర తులాల బంగారం, 50వేల నగదు అపహారణ

viswatelangana.com
March 7th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కొరుట్ల పట్టణంలో కాముడు పెంట 33 వార్డులో గల మైలరపు అంజయ్య ఇంటిలో దొంగలు తాళాలు పగలగొట్టి సుమారు మూడున్నర తులాల బంగారం, 50వేల నగదు చోరీ అయినట్టు బాధితుడు తెలిపారు. గత పది రోజుల కింద సమీప బంధువుల ఇంటికి తాళాలు వేసుకొని వెళ్లారు.గురువారం ఇంటికి తిరిగి వచ్చి చూడగా తాళాలు పగలగొట్టి ఉండగా, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి క్లూజ్ టీం తో దర్యాప్తు చేస్తున్నారు.



