తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జాతీయ పథకం ఆవిష్కరణ
వంద రోజుల కార్యాచరణ కార్యక్రమం ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్

viswatelangana.com
కోరుట్ల మునిసిపాలిటిలో వంద రోజుల కార్యాచరణలో బాగంగా 2025 జూన్ 02 సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని మునిసిపల్ కార్యాలయంలో జాతీయ పథక ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం మునిసిపల్ కమీషర్ అద్యక్షతన ఏర్పాటు చేసిన వంద రోజుల కార్యాచరణ కార్యక్రమాన్ని కోరుట్ల మున్సిపల్ కమిషనర్ చే ప్రారంభించడం జరిగింది. అలాగే మునిసిపల్ కార్యాలయము నుండి కొత్త బస్టాండ్ వరకు వంద రోజుల ప్రణాళికా కర్యక్రమాముపై ర్యాలీ, మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. మెప్మ సిబ్బంది, కార్యాలయ సిబ్బందితో వంద రోజుల ప్రణాళికా పై, అవగాహన పై సమావేశం నిర్వహించనైనాది ఇందులో భాగంగా శానిటేషన్ సిబ్బందికి పిపి కిట్స్ అందించడం జరిగింది. అలాగే మెప్మ సిబ్బంది ఫుడ్ స్టాల్ ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వంద రోజుల కార్యక్రమన్ని కోరుట్ల ప్రజలు విజయవంతం చేయలని దీనిలో భాగంగా మొదటి రోజు నుంచి తడి చెత్త- పొడి చెత్త వేరు చేసే విధానం గురించి, ప్లాస్టిక్ నిషేధం, పబ్లిక్ టాయిలెట్ల వినియోగం, పరిసరాల పరిశుభ్రత, వనమహోత్సవం, భువన్ సర్వే, మహిళ సంఘాల పథకాలు మలేరియా, డెంగ్యూ, డ్రై డే ఫ్రైడే, స్వచ్ఛత పోటీలు, మహిళా సంఘాల వివిధ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ మారుతి ప్రసాద్, మునిసిపల్ సిబ్బంది, మెప్మ సిబ్బంది, మహిళ సంఘాల సభ్యులు అలాగే ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.



