రాయికల్

తెలుగు భాష దినోత్సవ వేడుకలు

viswatelangana.com

August 29th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని ప్రగతి ఉన్నత పాఠశాలలో గురువారం రోజున ప్రఖ్యాత తెలుగు కవి, రచయిత, భాషా శాస్త్రవేత్త గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా తెలుగు భాష దినోత్సవం వేడుకలు నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ బాలె శేఖర్, గిడుగు రామమూర్తి చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. గిడుగు రామమూర్తి తెలుగు భాషా వికాసానికి చేసిన కృషికి గాను ఆయన జయంతిని “తెలుగు భాష దినోత్సవం”గా జరుపుకుంటామని, తెలుగు భాష పట్ల ప్రేమను, గౌరవాన్ని పెంచడానికి ఈ దినోత్సవం ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు. అనంతరం పిల్లలు తెలుగు పద్యాలను పాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ జయశ్రీ, డైరెక్టర్ నిఖిల్ కుమార్, తెలుగు భాషా బోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button