తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం

viswatelangana.com
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మల్లాపూర్ మండలము రేగుంట గ్రామంలోని నివేదిత అనాధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం కోరుట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మానుక ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగినది.9 నెలల లో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్ నాయకత్వంలో అధికారం చేపట్టి చరిత్ర సృష్టించిన తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రెండు రూపాయల కిలో బియ్యం జనతా వస్త్రాలు ఆస్తిలో మహిళలకు సమాన హక్కు అక్క గృహ నిర్మాణ పథకం పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు మహిళలకు ఎన్నికల రిజర్వేషన్ బలహీన వర్గాలకు రాజకీయంలో చైతన్యం మాండలిక వ్యవస్థ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి తెలుగు ప్రజల గుండెలలో ఉన్న వ్యక్తి ఎన్టీఆర్ రాబోయే రోజులలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అవుతారని ఆయన దోస్త్ చెప్పారు రాబోయే రోజులలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కొరకు అందరూ కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బాలే మారుతి, చొప్పరి శేఖర్, ఎండి నజీరుద్దీన్, షేక్ దస్తగిరి, ఎనిగందుల శ్రీనివాస్, మహమ్మద్ సమీర్ తదితరులు పాల్గొన్నారు.



