దుంపేట్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి జాతర మహోత్సవ సందర్భంగా స్వామివారి కల్యాణ మహోత్సవం

viswatelangana.com
కథలాపూర్ మండలంలోని దుంపేట గ్రామంలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఆరంభం అయినాయి. ఇందులో భాగంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు తులసి పుష్ప అర్చన మంగళహారతి మంత్రపుష్పం విశేష పూజలు జరిగాయి. ఈరోజుతో ఆరంభమైన బ్రహ్మోత్సవాలలో భాగంగా తొలిరోజు విశ్వక్సేన ఆరాధన, మహాగణపతి పూజ, పుణ్యాహవాచనం, శ్రీ గౌరీ పూజ, నాంది పూజ, అంకురారోపణ, స్థాపిత దేవత పూజలు, స్వామివారి ఎదురుకోలు, గరుడ ఆవాహన, గరుడ కళ్యాణం, విశేష హవనాలు తరవాత శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం వేద పండితుల ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ నారంభట్ల వామన్ శర్మ, నారంభట్ల హరిప్రసాద్ శర్మ, గిరిధర్ శర్మ, శ్రీధర్ శర్మ, మోహిత భరద్వాజ్ శర్మ, బ్రహ్మశ్రీ రాజు శర్మ వైదిక పర్యవేక్షణలో ఎంతో వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి.ఈ కళ్యాణోత్సవంలో దుంపేట గ్రామ పెద్దమనుషులు మరియు అనేక భక్తుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈరోజుతో ఆరంభించబడి ఏడు రోజులు స్వామి వారి ఉత్సవాలు ఎంతో వైభవంగా సాగుతాయి. ప్రతిరోజు సాయంత్రము శ్రీ లక్ష్మీనరసింహస్వామి సేవా మహోత్సవము సాయంత్రం దుంపెట పుర వీధుల గుండా సాగుతుంది. గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు



