కథలాపూర్
నల్గొండ దగ్గరుందా…? అసెంబ్లీ దగ్గరుందా…?

viswatelangana.com
February 13th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ మండల్ ఉట్పల్లి గ్రామంలో యూత్ కాంగ్రెస్ నాయకుడు ముదాం శేఖర్ మాట్లాడుతూ కేసీఆర్ నువ్వు నిజాయితీ పరుడివే అయితే అసెంబ్లీలో చర్చకు ఎందుకు రాలేదు..? కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి నుండి దృష్టి మరల్చడం కోసమే శాసనసభకు రావడానికి కాలు విరిగిందని సాకులు చెప్పారు నల్గొండ సభకు ఎలా వెళ్లారు..? నల్గొండ దగ్గర ఉందా..? శాసన సభ దగ్గరుందా..? నువ్వు నిజాయితీ పరుడవని తెలంగాణ తెలంగాణ సమాజం భావించడం లేదు,కేసీఆర్ నీ దోపిడీ వల్ల మేడిగడ్డ బలైంది. అన్నారం సుందిల్ల సున్నం అయ్యాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు.



