రాయికల్
నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన

viswatelangana.com
January 20th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
మతోన్మాదంతో ఇటీవల తుక్కుగూడ పాఠశాల ప్రధానోపాధ్యాయునిపై జరిగిన దాడిని ఖండిస్తూ జగిత్యాల జిల్లా, రాయికల్ మండలంలోని, మైతాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయ బృందం నల్ల బ్యాడ్జీలను ధరించి, సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయునిపై దాడి చేసిన ఆగంతకులపై కేసు నమోదు చేసి, చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముక్కాల మోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు వేముల మధు, కలువకోట కార్తీక్, వేముగంటి గిరిధర్, రాపర్తి నర్సయ్య, సిద్దె గంగరాజం, కొండూరి రజనికాంత్ తదితరులు పాల్గొన్నారు.



