రాయికల్

నాట్య మయూరి అంజన శ్రీ

viswatelangana.com

December 4th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన బొమ్మకంటి నాగరాజు – గౌతమి కూతురు బొమ్మకంటి అంజన శ్రీ ( జూనియర్ సుధా చంద్రన్ ) జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కూచిపూడి నాట్యంతో అందరిని ఆకట్టుకుంది. రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య నాట్యాన్ని చూసి అభినందించారు. అనంతరం అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా అంజనశ్రీని జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరేష్, మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు, డాన్స్ మాస్టర్ మచ్చ దేవదాస్ పలువురు అభినందించారు.

Related Articles

Back to top button